ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమని వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో తల్లులకు 15 వేలు, పిల్లలకు 15 వేలు అంటూ వారు ప్రచారం చేసి మోసం చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే చొక్కా పట్టుకోమని చెప్పిన నేతలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా వైయస్ జగన్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని బాబు చెప్పుకోవడం దివాళకోరుతనమన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాష్ట్రానికి ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో క్వాలిటీ చదువు కన్న క్వాలిటీ మద్యాన్ని చంద్రబాబు అందిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు.