కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రాన్నిఅప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లాలో సోమవారం వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైయస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైయస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు అని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైయస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైయస్ జగన్ అండగా ఉంటారు.
కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోంది..
