మరికాసేపట్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలోవైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ నాయకులతో కలిపి ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బొత్స బయలుదేరనున్నారు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుండగా, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఆరు మంది సభ్యులతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేయగా.. అభ్యర్థి ఎంపికపై నేడు మరోసారి నాయకులు సమావేశం కానున్నారు. బొత్స పై పోటీకి స్థానిక నాయకులు ముందుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్తగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి రాగా, ప్రచారంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దూసుకుపోతున్నారు.
కాసేపట్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్..
