మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒక నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డారు. జగ్గయ్యపేట సీటు తనకు కానీ తన భర్తకు కానీ ఇవ్వాలని వైఎస్ జగన్ పై ఒత్తిడి పెంచారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిరాకరించారు. దీంతో ఆమె మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని అప్పట్లో ఆమె స్పష్టం చేశారు. నాటి నుంచి యాక్టివ్‌గా ఉంటూ వైసీపీ తరఫున గొంతు వినిపించింది. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె సైలెంట్ అయ్యిపోయింది.
మీ సొంత రాజకీయ ఎజెండాతో జగన్ పై బురద జల్లడం ఎంత వరకు సమంజసం? పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద పదవులు అనుభవించిన మీరు నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వరుదు కళ్యాణి చురకలంటించారు. దిశ గురించి గతంలో మాటలకు, ఇప్పటి మాటలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూసుకోవాలని, ఎవరి ప్రోద్భలంతో విమర్శలు చేస్తున్నారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, స్వలాభం కోసం ఆత్మవంచన చేసుకోవద్దని హితవు చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఇంతగా పోరాడుతున్న జగన్ గారిపై బురద చల్లడం సమంజసం కాదని, దాన్ని ఎవ్వరూ హర్షించరని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.