అనితా ఆత్మ పరిశీలన చేసుకో..

rk-roja-06.jpg

ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలో పదోతరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంలో అనిత చేసిన వ్యాఖ్యలపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారికి కోరారు.

మాజీ మంత్రి రోజా ట్విట్టర్‌ వేదికగా హోంమంత్రి అనిత, ఎస్పీ ఒక్కసారి మీరు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని తన బిడ్డకి న్యాయం చేయాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఆ తండ్రి బాధ మీకు కనిపించలేదా? ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు? వాస్తవాలు దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Share this post

scroll to top