నేడు జాతీయ మహిళా కమిషన్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు

kalyani-29.jpg

కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దారుణలపై  వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మంగళవారం మద్యాహ్నం 2గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవిలు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌తో భేటీ కానున్నారు.

ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా జరిగిన దురాగతాల నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై వైయ‌స్ఆర్‌సీపీ మహిళ నేతలు జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు.

Share this post

scroll to top