Tag Archives: ysrcp

రాయలసీమ పౌరుషం ఉంటే నా చాలెంజ్ స్వీకరించు.. మాజీ మంత్రి అనిల్ కుమార్

పల్నాడు గడ్డ మీద ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్ధి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలెంజ్ విసిరారు. తాను అన్ని వదిలేసి రాజకీయాలే పరమావధిగా బ్రతుకుతున్నానని, తన 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసురుతున్నా అన్నారు. నేను పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ సవాల్ నీ కొడుకు చేత స్వీకరించే దమ్ముందా? అని చాలెంజ్ విసిరారు. ...

Read More »

పవన్ అందుకే తాను పోటీ చేసే స్థానం ప్రకటించడంలేదు..

టీడీపీ-జనసేన పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో ప్రకటిస్తే… జగన్ అక్కడ ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఆయన సంగతి తేలుస్తాడని భయం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ...

Read More »

ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలే.. కొడాలి నాని

ఏపీ సెక్రటేరియట్ ను జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెడ్డడం సాధారణ విషయమేనని చెప్పారు. సచివాలయం అనేది కేవలం పదెకరాల ఆస్తి మాత్రమేనని అన్నారు. ఈ ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాశారా ...

Read More »

జస్ట్ వాలంటీర్ కాదు.. గ్రేట్ వాలంటీర్..

అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి గ్రామాలు దూరం దూరంగా ఉంటాయి. హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ పాటిగరువు గ్రామానికి చెందిన వాలంటీర్ రోజాకు శుక్రవారం ఉదయం వివాహమైంది. అయితే శుక్రవారం ఒకటో తేదీ కావడంతో పెన్షన్ల కోసం అప్పటికే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు… గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో జరిగే పెన్షన్ల పంపిణీ లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకటో తేదీ కోసం ఎదురు చూసే ...

Read More »

అంబడిపూడి నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ శ్రీలంక కొండ పైన స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో రూ.35,00,000/- ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. మెట్లు,లాడింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు హాజరైయ్యారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు కోటి నాగులు గార్లు మరియు వైసీపీ ముఖ్య ...

Read More »

నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్ఠానం… నరసరావుపేట లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచేపల్లి సభలో అనిల్ కుమార్ పై సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో, అనిల్ కుమార్ యాదవ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నరసరావుపేటలో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ...

Read More »

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను ఖండించిన విజయసాయి రెడ్డి

ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను YCP ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబుతో నాలుగు గంటలు భేటీ అయిన తర్వాత ఎలాంటి లాజికల్ డేటా లేకుండా ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందిని కాపాడాయి’ అని ట్వీట్ చేశారు.

Read More »

ఎంపీ అభ్యర్ధిగా అలీ.. అక్కడి నుంచే పోటీ..?

అలీ సొంత నియోజకవర్గం రాజమండ్రి. అక్కడ కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలీ. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆలీ ఆకాంక్ష. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా రాజమండ్రి ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో అలీ సైతం పునరాలోచనలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు అనుకూలమైన అసెంబ్లీ నియోజకవర్గాలపై తొలుత దృష్టి పెట్టారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వైసీపీలో సీనియర్లు ఉన్నారు. దీంతో ఎక్కడైనా ఎంపీగా పోటీ చేస్తే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ...

Read More »

స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్

స్మగ్లింగ్ తో, హత్యలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీలోని కాకర్లవంకలో కొందరు వ్యక్తులు దీనిని నిర్మించారు. స్మారకంపై వీరప్పన్ చిత్రపటంతోపాటు జెండాను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భరత్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించి ఫొటోలకు పోజిచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో భరత్ కుప్పం నుంచి శాసనసభకు ...

Read More »

ప్రశాంత్ కిశోర్ అంచనాలపై మంత్రి అంబటి రాంబాబు స్పందన

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ పరిస్థితులపై స్పందిస్తూ… ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, జగన్ ఏం చేసినా గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. పథకాల పేరిట ప్రజలకు డబ్బు ఇస్తుండడం ఎన్నికల్లో ఎంతమాత్రం పనిచేయదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు… ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు.

Read More »