ఏపీ ప్రభుత్వం పించన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అనర్హుల ఏరివేతకు కసరత్తులు మొదలుపెట్టింది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్రస్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇలా జాబితాలను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది.
పింఛన్లు వారందరికీ కట్..
