తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు అక్కినేని నాగార్జున. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఆ మాటలు వైరల్‌గా మారాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు.
సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున..
