ఇక ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సమస్యల కారణంగా న్యాయం చేయలేకపోతున్నానని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయమని స్వయంగా జగన్ ను కోరినట్లు చెప్పారు. కానీ నెమ్మదిగా అన్ని సెటిల్ అవుతాయి, దీనికే పార్టీనుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు డిస్ట్రబ్ గా ఉన్నాను. ప్రజల నుంచి తిరిగి గౌరవం తెచ్చుకునే వరకు కనీసం ఏడాది పాటైనా ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించమని సెకండ్ రిక్వెస్ట్ చేశా. అందుకే వేరే వారిని నియమించారు. రెండో సంబంధం విషయంలో పవన్ కళ్యాణ్ రిలేషన్ తప్పు కాకపోతే నాది తప్పు ఎలా అవుతుంది? వ్యక్తిగత విషయాలను పార్టీకి లింక్ చేయొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇక భార్య వాణితో ఏరోజు సంతోషంగా లేనన్నారు. పెళ్లైన రెండేళ్లకే టార్చర్ చేసిందని, ఆమెతో కలిసున్నని రోజులు నరకం చూపించిందన్నారు.
పవన్‌ను టార్గెట్ చేసిన మాధురి..
