జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతుల వద్ద వీరభద్రం, స్వాతి ఇద్దరు కలిసి 16 లక్షలు తీసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ పెరుగుతూ వచ్చింది. దీంతో రత్నకుమార్, పార్వతి ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో పార్వతి, రత్న కుమార్ లకు స్వాతి రూ. 16 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే స్వాతి.. వీరభద్రానికి ఆ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బును చూసిన వీరభద్రం ఆశ పెరిగింది. డబ్బులను తన సొంతం చేసుకోవలని అనుకున్నాడు వీరభద్రం. దీంతో స్వాతికి డబ్బులు ఇవ్వకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు.
అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. స్వాతిని ఎవరూ గుర్తుపట్టలేనంతగా 20 ముక్కలు చేశాడు వీరభద్రం. ముక్కలుగా చేసిన స్వాతిని ఒక మూటలో వేసి.. పక్కనే వున్న పొలంలో పడేసి ఏమీ తెలియనట్లు వీరభద్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న భద్రాది పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు షాకింగ్ కు గురయ్యారు. ఒక మూటలో ముక్కలుగా వున్న మహిళ మృత దేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా అందులో వున్న ముక్కలైన మృతదేహం స్వాతిది అని గుర్తించారు.