2027 FEBలోనే జమిలికి ఛాన్స్..

jamili-13-.jpg

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని గత కొంతకాలంగా బీజేపీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇటీల కేంద్ర కేబినెట్ కూడా వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. వచ్చే శీతాకాలం పార్లమెంటులో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. 

దేశంలో జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడించారు. దీనికి కాంగ్రెస్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. 2027 ఫిబ్రవరిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని అంచనా వేశారు. అంతకు 6 నెలల ముందే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 225కు, ఎంపీ సెగ్మెంట్లు 30కు చేరొచ్చని పేర్కొన్నారు.

Share this post

scroll to top