దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలే వస్తే 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది. అయితే, ఈ తరుణంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.