హీరోయిన్ అదితీ రావు హైదరీ ఇటీవల ‘హీరామండి: ది డైమండ్ బజార్ కీలక పాత్రలో నటించి మెప్పించింది. తన డ్యాన్స్‌తో కుర్రాళ్లను మంత్రముగ్దులను చేసింది. ప్రజెంట్ దీనికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ క్రమంలో తాజాగా, అదితీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌తోనే పెరిగాను. కానీ ‘హీరామండి’లో చేయాల్సింది కథక్. ఈ విషయంలో భన్సాలీని నిరాశకు గురి చేయొద్దని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఆయన కోసమే కథక్ నేర్చుకున్నాను. అయితే సెట్లో కొన్ని సార్లు భావోద్వేగ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైనవి చేయమంటే రొమాంటిక్‌గా చేశాను.
ఎంత ప్రయత్నించినా సహజంగా రాకపోవడంతో ఆకలితో చేస్తే బాగా వస్తాయని దర్శకుడు భోజనం మానేయమని సలహా ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. నిజమైన భావోద్వేగాలను తెరపై చూపించడానికి ‘హీరామండి’ షూటింగ్ పూర్తి అయ్యే వరకు భోజనం మానేశాను. అయితే ఆ పద్ధతి నన్ను మరింత ఉత్సాహంగా పని చేసేలా చేసింది అని చెప్పుకొచ్చింది. ఇక అదితీ రావు హైదరీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఆమె హీరో సిద్ధార్థ్ ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఇటీవల మళ్లీ డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.