రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబాన్ని వీడడంలో లేదు. ఇప్పుడు రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో ఏ5గా ఉన్న రైస్ మిల్లర్ బాలాంజనేయులును పేర్ని నానిని కూడా ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పోలీసులు పెట్టిన కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ వేశారు పేర్ని నాని.