విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం రూ. 11,440 కోట్లతో ప్యాకేజీని ప్రకటించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్యాకేజీ చరితాత్మక నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అధికారికంగా ప్రకటనను విడుదల చేయడం పట్ల కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాటకు ప్యాకేజీ దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.