మొన్న శ్రీ చైతన్య, నేడు నారాయణ..

fee-24-.jpg

విద్యార్ధుల భవితవ్యం కన్నా ఫీజులే ముఖ్యమనుకునే ప్రైవేట్ కాలేజీల నీచత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. రాష్ఠ్రంలో పేరుగాంచిన నారాయణ జూనియర్ కాలేజీ ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. తాజాగా సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన విద్యార్ధి ఫీజు మొత్తం కట్టాలని ఒత్తిడి తేవడంతో అవమానం భరించలేక ఆ విద్యార్ధి కాలేజీ భవనంపై నుంచి దూకి తనువు చాలించాడు.

ప్రైవేట్ జూనియర్ కాలేజీల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన ఇంటర్‌ విద్యార్ధి సకాలంలో ఫీజులు చెల్లించలేదని కాలేజీ యాజమన్యం కళాశాలలోకి అనుమతించకుండా గేటువద్దే గంటల తరబడి బయటే నిలబెట్టారు. దీంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అనంతపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Share this post

scroll to top