ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణమని శుక్రవారం ట్విటర్ వేదిక ద్వారా పేర్కొన్నారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మహిళలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఈ పథకాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక సాకులు చెబుతుందని దుయ్యబట్టారు. ఉచిత బస్సు విధానంపై ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదేనని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఫ్రీ అంటూనే కండీషన్..
