మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మా నాయకుడిలోనే మార్పు వచ్చింది అని తెలిపారు. కోటరీకి అనుకూలంగా ఉంటే జగన్ దగ్గరికీ వెళ్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్ కి చెప్పాను. కానీ ఆయన చెప్పుడు మాటలు నమ్మడం వల్లనే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోయాయని గుర్తు చేశారు.
కోటరీ వల్లనే తాను జగన్ కి దూరం అయ్యాను. మీ మనస్సులో నాకు స్థానం లేదు. మీ మనస్సులో స్థానం లేనప్పుడు నేను పార్టీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడుతారని తెలిపారు. చుట్టూ ఉండే వారి మాటలు వినొద్దని చెప్పినట్టు తెలిపారు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం తన మనస్సులో లేదని చెప్పారు. వ్యవసాయ దారుడు మంచి చొక్కా, ప్యాంట్ వేసుకోకూడదా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.