మెగాస్టార్ చిరంజీవి ఇది ఒక పేరు కాదు బ్రాండ్. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక పేజ్ లిఖించుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చిరంజీవి ఎన్నో అవార్డులని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో వేడుక జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తదితరులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు. చిరంజీవిని హౌజ్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్..
