ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం మేరకు ఎంపీ మిథున్ రెడ్డి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. కానీ మిథున్ రెడ్డి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అధికారులు అంటున్నారు. లిక్కర్ స్కామ్లో మరింత విచారణ చేయాల్సిన ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట..
