దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. ఎక్సయిజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. వాహనదారులు, ప్రజలు అవాస్తవాలు నమ్మి గందరగోళానికి గురికావొద్దని సూచనలు చేసింది. తాజాగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ని రూ.2 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం మరో ప్రకటన..
