కంటతడి పెట్టిన విశాఖ మేయర్..

visaka-16.jpg

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.విశాఖపట్నం మేయర్ పీఠాన్ని అధికార కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని మేయర్ హరివెంకట కుమారి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేయర్ పీఠం కోసం బెదిరింపులకు పాల్పడుతోందని కంటతడి పెట్టుకున్నారు. తమకు సంఖ్యాబలం అనుకూలంగానే ఉందని మేయర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలాఉండగా, ఈనెల 19న విశాఖ కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.ఇప్పటికే కూటమి కార్పొరేటర్లు తీర్మానం అందజేసినట్లు తెలిసింది.

Share this post

scroll to top