ఎలాగైతేనేం చంద్రబాబు, పవన్‌లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇబ్బడి ,ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించినవారు ఇప్పుడు బిత్తరపోతున్నారు. ఇరవైరోజుల్లోనే ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవసరార్దం వెయ్యి కోట్లు రుణం సేకరించినా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా,చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడువేల కోట్ల అప్పు చేస్తే అదసలు లెక్కే కాదన్నట్లుగా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అంతేకాదు జూలై నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అయితే ఈ అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు.
ఏపీలో అప్పులు.. లెక్కలు.. ఇక నుంచి అంతా మాయేనా?
