ఆ జిల్లాలో అరుదైన జంతువు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

pawan-kalyan-09.jpg

కోరింగ అభయారణ్యంలో అరుదైన ఫిషింగ్‌ క్యాట్‌ ఉన్నాయి. ఈ జాతి ఇక్కడ ఎంత ఉందో లెక్కలు సేకరించాలని పవన్ ఆదేశించారు. ఈ ఫిషింట్ క్యాట్‌లను రక్షించాలన్నారు. అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ గణనపై డిప్యూటీ సీఎం దృష్టి పెట్టారు. వీటి సంచారం గురించి తెలుసుకోవాలని పవన్ అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో.. సాంకేతికత ఆధారంగా వాటి సంచరాన్ని తెలుసుకోవచ్చు అని అని అంచనా వేస్తున్నారు. అయితే కోరింగ అభయారణ్యం లో మొత్తం 100 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ పిల్లుల సంచారాన్ని గుర్తించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. డబ్ల్యూఐఐ సహకారంతో త్వరలో రేడియో కాలరింగ్‌ ఏర్పాటు చేస్తామని.. సమాచారం సేకరిస్తామని అధికారులు తెలిపారు.

Share this post

scroll to top