జగన్‌ ని ప్రధాన ప్రతిపక్షంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

appi-reddy-22.jpg

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు మండలి చైర్మన్ గెజిట్ విడుదల చేశారు. 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అప్పిరెడ్డి. ఆయన పదవీకాలం 2027తో ముగియనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ పేరిట సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మరోవైపు శాసనసభలో తమను  ప్రధాన ప్రతిపక్షంగా  గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

Share this post

scroll to top