ఏపీ బకాయి మాఫ్‌..

cbn-26-1.jpg

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పర్యటన ప్రభావం బడ్జెట్‌పై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2023-24 బడ్జెట్‌ అంచనాల్లో అంతర్రాష్ట్ర సర్దుబాట్లు పద్దులో రూ.17,828 కోట్లు రావాల్సిన ఉన్నాయని సర్కార్‌ పేర్కొన్నది. ఈ మొత్తం ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సి ఉన్నది. వీటితోపాటు ఉమ్మడి ఆస్తుల నిర్వహణ కింద రాష్ర్టానికి ఏపీ నుంచి రావాలసినవి రూ.405 కోట్లు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన సీఎస్‌ఎస్‌ నిధులు రూ.495 కోట్లను పొరపాటున ఏపీ ఖాతాలో జమచేసింది. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు కేసీఆర్‌ సర్కార్‌ తీవ్ర ప్రయత్నాలు చేసింది. 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం అంతర్రాష్ట్ర సర్దుబాట్ల పద్దును సున్నాగా పేర్కొన్నది. దీంతో ఏపీ నుంచి వివిధ శాఖలు, పద్దుల కింద రావాల్సిన బకాయిలను సర్కార్‌ మాఫ్‌ చేసినట్టే ఉన్నదని ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top