ఇకపై రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమగ్ర భూ సర్వే పేరుతో పాస్‌పుస్తకాలపై నాటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ప్రచురించడం, చివరకు సర్వే రాళ్లపైనా ఆయన బొమ్మలు వేయడాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇకపై రాజముద్రతో పాస్‌పుస్తకాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఆ నమూనాకు సీఎం పచ్చజెండా ఊపారు.
రిజిస్ట్రేషన్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
