రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుని మోసం చేశారని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన లావణ్య. న్యాయం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలుస్తానని తెలిపింది. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం.. రాజ్ నన్ను వదిలేసి పారిపోయాడని న్యాయం చేయాలని అడగాలనుకుంటున్నా పవన్ కూడా పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన తన సతీమణిలకు ప్రాధాన్యత ఇచ్చారు. బాధ్యతలు వదలుకోలేదని ఆమె తెలిపింది. రాజ్‌తరుణ్ నా అవసరాలకు డబ్బులు ఇవ్వట్లేదని పేర్కొన్నాది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్ మరో మహిళలకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల అతను మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నది. 2014లో రాజ్‌తో పెళ్లి జరిగిందని తెలిపింది.
పవన్ కళ్యాణ్ ఇంటికి లావణ్య..
