విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం 1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయివేటీకరణ జరగబోదని పీలర్స్ ఇస్తూనే తెరచాటు వ్యవహారాలను చక చక పూర్తి చేసేస్తోంది. 2000 మందికి టిఆర్ఎస్ అమలు చేయాలని ఆలోచన సీనియర్ ఉద్యోగులను నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులో జాప్యం వంటి వ్యవహారాలతో ఆందోళన రెట్టింపు అయ్యింది.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన..
