ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు..

samagra-12.jpg

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు. ఐడీ కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో వడ్లు కొనేంతవరకు ఇంటింటి సర్వేకు సహకరించబోమని గ్రామస్తులు తీర్మానించారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందిని మా గ్రామానికి రావద్దంటూ తిప్పి పంపించారు. ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పంటలు పండించాం. తీరా పండిన పంటలను కొనకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Share this post

scroll to top