ఈసారి బకాయిలు ఏవీ లేవు..

penshion-27.jpg

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే జులైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది. ఈసారి బకాయిలు ఏవీ లేవు కాబట్టి జులైతో పోల్చితే, ఆగస్టులో ఇచ్చే పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్నే మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు రూ.4000 చొప్పున ఇవ్వనుంది. మిగతా 27 కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారం ఇవ్వనుంది. ఆగస్టు 1నే మొత్తం పెన్షన్లు మంజూరయ్యేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతా బాగానే ఉన్నా, కొత్త వారికి పెన్షన్ల సంగతేంటి? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రతీ నెలా కనీసం 50వేల మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే.. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ.. 4 నెలల్లో కొత్తగా 2 లక్షల మందిని పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. ఇది అదనపు భారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రతి నెలా కనీసం 50 వేల మంది పెన్షనర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వారిని చేర్చినా, మొత్తం లబ్దిదారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు.

Share this post

scroll to top