ఆదివాసీ మ‌హిళ‌ల‌తో కలిసి చంద్రబాబు నృత్యం..

cbn-9-1.jpg

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. ఆ తర్వాత డప్పు వాయించారు. ఆ తర్వాత ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించి.. రుచి చూశారు. అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగాలను గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాగలిగారని అన్నారు.

Share this post

scroll to top