అవునా.. అలా కనిపించడం లేదా?. అయినాసరే రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు ఎలాగైనా లెక్కలు చూపించండి’’.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి!. శ్వేత పత్రాల పేరిట జగన్ పాలనను ఏదో ఒకరకంగా తప్పుబట్టాలని చూస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని రంగాలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వైట్ పేపర్లు విడుదల చేస్తోంది. అమరావతి, ఆ వెంటనే విద్యుత్ శాఖపై లేనిపోని లెక్కలు చెబుతూ స్వయంగా చంద్రబాబు ఆ పత్రాలు విడదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై అధికారులతో సమీకక్షించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే..
అప్పులు ఎలాగైనా ఆ ఫిగర్ చేరుకోవాలి.. చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ అధికారుల మల్లగుల్లాలు
