నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 6.15కి కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాత్రి లేదా రేపు ఉదయం 10.30 గంలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నట్లు సమాచారం. ఇక రేపు ఉదయం 11.30 గంటలకి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో, ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్‌పూరీతో వంటి పలువురు మంత్రులతో ఏపీ సిఎం భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా చంద్రబాబు వరద సాయం గురించి ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదల వంటి అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు.
ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..
