రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు..

nagababu-28.jpg

సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం.

ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్‌ జారీ చేసింది. దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి ఖరారైనట్టు తెలుస్తోంది. మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది. ఇక మూడో స్థానం కోసం టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, సానా సతీష్‌, గల్లా జయదేవ్‌ జనసేన నుంచి నాగబాబు. బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేస్‌లో ఉన్నారట.

Share this post

scroll to top