ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుంది : వైస్ జగన్

jagan4zs.jpg

ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలోని ఐ ప్యాక్ ఆఫీసుకు జగన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్.

వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.

Share this post

scroll to top