ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. అయితే, మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విజ్ఞప్తులు అందాయి. దసరా సెలవులు, ఇతర కారణాల నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం గడువును రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు.16వ తేదీ నుంచి లైసెన్సుదారులు దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. ఇక అదేరోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.