అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు. నారాయణ వచ్చే నెల 15వ తేదీలోగా రైతులకు సంబంధించిన పెండింగ్ కౌలు నిధులు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. రైతులకు నిధులు విడుదలకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ.
అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..
