ఇన్నాళ్లూ రకరకాల ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం అసలు రంగు ఇవాళ శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. గురువారం మండలిలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దావోస్ పర్యటనకు ముందు చంద్రబాబు, లోకేష్‌లు ఊదరగొట్టారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. తీరా దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దావోస్ నుంచి ఎంత పెట్టుబడులు వచ్చాయని వైయస్ఆర్‌సీపీ సభ్యులు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వీరి ప్రశ్నకు ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. దావోస్ పర్యటనలో ఏంఓయూ లు జరగలేదని అంగీకరించింది. డబ్ల్యూఈఎఫ్ కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే అంటూ సమాధానం వింత భాష్యం చెప్పారు. అది పెట్టుబడులకు ఎంఓయూ లు చేసుకునే వేదిక కాదంటూ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్సీలు ఆశ్చర్యపోయారు. చంద్రబాబుతో పాటు దావోస్ పర్యటనకు వెళ్లిన పక్క రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఎంవోయూలు కుదుర్చుకున్న విషయాన్ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు గుర్తు చేస్తున్నారు.