మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వివాహిత మహిళలకు ఇచ్చే మెటర్నిటీ లివ్ లను చంద్రబాబు సర్కార్ పొడగించింది. మెటర్నిటీ లివ్‌లను 120 నుంచి 180కి పెంచింది. అంతేకాదు ఇద్దరు పిల్లకు మాత్రమే లివ్‌లు వర్తింపు అనే నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది. మెటర్నిటీ లివ్‌లను 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుకోగా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని ఎన్నికల సమయంలో నేతలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా తాజాగా మెటర్నిటీ లివ్‌లను పొడగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లివ్‌లు 120 రోజులు ఇస్తున్నారు. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న తరహాలోనే 180 రోజులు ఇవ్వనున్నారు. అంతేకాదు ఇక నుంచి ఎంతమంది పిల్లల్ని కన్నా మెటర్నిటీ లివ్‌లు మాత్రం యథావిథిగా వర్తింస్తాయి. మహిళా ఉద్యోగుల వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.