కొడాలి నానికి బిగ్ షాక్..

kodali-nani-23.jpg

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్‌ నానికి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. నాని అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నాని అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే త్వరలోనే నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాదు నాని కదలికలపై నిఘా పెట్టాలని ఫిర్యాదు చేసిన కనపర్తి అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నాని పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని పోలీసులను కోరారు.

Share this post

scroll to top