వాతావరణంలో జరిగే మార్పులు శరీరంపై ప్రభావం చూపుతాయి. భారీ వర్షాల కారణంగా.. రోగనిరోధక శక్తి బలహీనపడి పలు రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. వర్షాకాలంలో వెదర్ కూల్‌గా ఉండటంతో పాటుగా కాస్త చలిగా కూడా అనిపిస్తుంటుంది. దీంతో చాలా మంది చల్లటి వాతావరణంలో వేడి వేడి సమోసా, మిర్చీ బజ్జీ, పానీ పూరి, ఫ్రైడ్ రైస్, మంచూరియా వంటివి తినాలని అనిపిస్తుంటుంది. సమోసాలు, బజ్జీలు, పానీ పూరి ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తారు. సాయంత్రం కాగానే ఏదో స్నాక్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే జాగ్రత్తలు పాటించకుండా ఏది పడితే అది తినేస్తూ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటారు. ఈ సీజన్‌లో సీ ఫుడ్‌ను జనాలు అతిగా తింటుంటారు. చేపలతో వెరైటీస్ చేసుకుని కూల్ వెదర్‌లో లాగించేస్తుంటారు. అలాగే మందులో స్టఫ్‌గా కూడా వేయించిన చేపలు తింటుంటారు. కానీ వర్షాకాలం తినడం వల్ల కలుషితమైన నీటిలోని చేపలు తినడంతో అనారోగ్యానికి గురవుతారు. కానీ వర్షాకాలం ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జలుబు, దగ్గు, మలేరియా, జ్వరం, డెంగ్యూ, ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, న్యుమోనియా వంటివి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇవన్నీ ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తుతాయి. కాబట్టి ఫుడ్ తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం మంచి నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.