నూతన మద్యం పాలసీ నేపథ్యంలో గ్రామాల్లో బెల్టు దుకాణాలకు భలే గిరాకి ఉంది. నాటు సారా విక్రేతలు, బెల్టు దుకాణదారులకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లాటరీ పద్ధతిలో దుకాణాలు దక్కించుకున్న వారు గ్రామాల్లో బెల్టు దుకాణాలు పెట్టుకునేందుకు బేరాలాడుతున్నారు. రూ.లక్ష ఇస్తేనే బెల్టు దుకాణానికి అవకాశం కల్పిస్తున్నారు. అదే సమయంలో నాటు సారా విక్రేతలు బెల్టు షాపులకు పోటీ పడుతున్నారు.
వీరే కాకుండా సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా పోటీలో ఉండడం గమనార్హం. అయితే మద్యం దుకాణదారులు బెల్టు షాపు పెట్టుకుంటే నాటుసారా అమ్మకాలు చేయరాదని మెలిక పెడుతున్నారు. దీంతో చాలా మంది రెండూ అమ్ముకుంటామని చెబుతున్నారు. ఇలా గ్రామాల్లో నెలకొన్న పోటీ తత్వం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులకు కాసుల పంట కురిపించనుంది.