మాతో పోల్చుకునే అర్హత  కేటీఆర్ కు లేదు..

batti-10.jpg

కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు. బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు కోసం కోమటి రెడ్డి 2004 నుంచి పొరడుతున్నారు. ఇపుడు నిధులు ఇచ్చి పూర్తి చేసినం. వెంకన్న జన్మ ధన్యం అయింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలి. వైఎస్ ఆర్ తో కోట్లాడి కోమటిరెడ్డి ప్రాజెక్టు మంజూరు చేపించుకున్నారు. నల్గొండ జిల్లా కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. మాకు తలా ఒక ఎకరం ఇవ్వవా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగానని చెప్పారు. 

Share this post

scroll to top