హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం మధ్యాహ్నం 3గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో మొత్తం చలి వాతావరణం నెలకొంది. నగరంలోని కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్ బీ నగర్, నాగోల్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడింది. ఈ ప్రాంతాలతో పాటు చైతన్యపురి, సైదాబాద్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలో ద్రోణి ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్ .. ఆ ప్రాంతాల్లో భారీ వర్షం..
