ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా ముఖంగా ప్రకటిస్తారని సమాచారం. తిరుమల ఆలయంలో ప్రతి ఒక్కరూ ఆచారాలు పాటించాలని సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితమే ట్వీట్ చేసిన క్రమంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిన్నటి నుంచే కూటమి నేతలు, హిందూ సంఘాలు జగన్ డిక్లరేషన్ ఇస్తేనే ఆలయంలోకి ప్రవేశించాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్‌పై భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగన్ పర్యటనపై దుమారం రేగింది.
జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు..
