డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్‌తో ముచ్చట పెట్టింది యష్మీ. ఎందుకురా నువ్విలా ఇలాగేనా నువ్వు అంటూ యష్మీ అడిగింది. దీనికి నేనిలా నేనిలా ఇంతేగా నేనేం చేసినా ఇంతేగా అంటూ ఏదో పాట పాడాడు నిఖిల్. దీంతో చాలా కష్టం అయితే వద్దు చెప్పేదొకటీ చేసేదొకటి అంటూ యష్మీ అంది. ఏం చెప్పా ఏం చేశా నేను ఫస్ట్‌యే చెప్పా కదా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దని అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో యష్మీకి కోపం వచ్చింది. నువ్వు మళ్లీ మళ్లీ అది చెప్పి నాకు కోపం తెప్పించకు ఏదో నేను అంటూ యష్మీ మాట్లాడుతుంటే మరి ఎందుకు హర్ట్ అవుతావ్ అంటూ నిఖిల్ అడిగాడు. ఎవరు హర్ట్ అయ్యారు. నేను హర్ట్ అవ్వలేదు నువ్వే ఇవన్నీ చేస్తే నేను హర్ట్ అవుతా అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావ్ అంటూ యష్మీ అంది. మరి ఇవన్నీ ఎందుకు మాటలు అంటూ నిఖిల్ అన్నాడు.
అసలు నేను ఎందుకురా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటా నాకు ఏం తక్కువురా అంటూ యష్మీ ఫైర్ అయింది. నాకేం తెలుసు అంటూ నిఖిల్ అంటే నాకెవరూ దిక్కులేక నీ దగ్గరికి వచ్చినట్లు చెబుతున్నావ్ నాకు ఇంకెవరూ లేరనుకుంటున్నావా అంటూ యష్మీ అంది. ఓ అది కూడా ఉందా అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో సెట్ అవదురా నీకు నాకు అంటూ యష్మీ అంది. నేను ఫస్ట్‌యే చెప్పా కదా అంటూ నిఖిల్ అన్నాడు. ఒకేలా ఉన్నవాళ్లు సెట్ అవుతారు అనుకున్నా అంటూ యష్మీ అంటే అవుతారు కానీ నేను ఉన్న మైండ్ జోన్‌కి సెట్ కాదు అంటూ నిఖిల్ చెప్పాడు.