బిగ్ బాస్ నుంచి హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్..

bigg-boss-03.jpg

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. మొన్నటివరకు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్‌లో నైనిక ఎలిమినేట్ అవుతుందని న్యూస్ జోరుగా ప్రచారం జరిగింది. ఆదిత్యం ఓం ఎలిమినేషన్కా నీ, అనుకోకుండా ఊహించని విధంగా ఐదో వారం మిడ్ వీక్‌లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ బుధవారం నాడు రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను గురువారం అంటే ఇవాళ స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ ద్వారా హీరో ఆదిత్యం ఓం ఎంత సంపాదించాడనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్‌లో హౌజ్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓం అడుగుపెట్టాడు. ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన ఐదో కంటెస్టెంట్‌గా ఆదిత్యం ఓం నిలవడం విశేషంగా మారింది.

Share this post

scroll to top