ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు రాగా.. ఇటీవలే కల్కి2898 ఏడీ వచ్చింది. త్వరలో మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో సినీ ప్రియులు కూడా కొన్ని సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్ రానున్న దేవర మూవీ. ఈ సినిమా గురించి వచ్చే అప్ డేట్స్ కోసం ఈగర్ గా చూస్తుంటారు. ఈ క్రమంలోనే దేవర మూవీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విలన్ గా యానిమల్ మూవీ నటుడిని దింపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో ట్విట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ సినిమా ఓ డైలాగ్ లీక్ అయిన సంగతి తెలిసింది. “సాదా సీదా మగాళ్ళు కావాలా..ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా…!” అనే డైలాగ్ లీక్ అయ్యింది. గూస్ పంప్స్ తెప్పిస్తున్న ఈ డైలాగ్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే దేవర సినిమా ప్రమోషన్ల కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈగర్ గా ఉన్నారు. మొత్తంగా యానిమల్ సినిమాతో అందరిని ఆకట్టుకున్న బాబీ డియోల్..తారక్ సినిమాలోను కనిపించనున్నాడనే వార్తతో దేవరపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఆయన రోల్ ఎలా ఉంటుందా? అని తెలుసుకునేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.